కొత్తగూడెం పట్టణంలోని పులిపాటి నర్సింగ్ కళాశాల పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో శనివారం సందర్శించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జయలక్ష్మి.. సందర్శనలో విద్య నాణ్యత మరియు అధ్యాపకుల అర్హతలపై క్షుణ్ణంగా విచారణ నిర్వహించారు.. నర్సింగ్ రంగంలో విద్యార్థులు సాధ్యమైనంత ఉత్తమ శిక్షణ పొందేలా చూసుకోవటానికి ఉన్నత విద్యా ప్రమాణాలు నిర్వహించటం యొక్క ప్రాముఖ్యతను వివరించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.. కార్యక్రమంలో వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు