యూరియా కోసం వచ్చే రైతులు తమ వెంట తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ తీసుకురావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, సుద్దాల గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో శుక్రవారం రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, కలెక్టర్ పరిశీలించారు. మండలానికి మొత్తం ఎన్ని బస్తాల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ను అడిగి తెలుసుకోగా, మొత్తం 1500 బస్తాలు వచ్చిందని కలెక్టర్ దృష్టికి డీఏఓ తీసుకువెళ్ళారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. వ్యవసా