యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు ఆదివారం సాయంత్రం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్య కైంకర్యాలు నిర్వహించి, ఆలయ ద్వారాలను బంధిస్తారని, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం రెండు దఫాలు జరుగుతాయని, మరుసటి రోజు తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం ఆలయం చేర్చుకుంటుందని ఈవో వెంకట్రావు తెలిపారు.