రాష్ట్రవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ కళాశాలలకు శ్రీకారం చుట్టారని వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్ర జయ సరిత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని దగ్గులూరు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ కాలేజీకి శ్రీకారం చుడితే దాన్ని వేరే చోటకి తరలించాలని ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ గురువారం సాయంత్రం ఐదు గంటలకు మీడియాతో మాట్లాడారు.