అనకాపల్లి జిల్లాలో వినాయక చవితి పండుగ కుటుంబ సమేతంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు ఇంటిలో మరియు వారు నివసిస్తున్న వీధులలో, గ్రామాలలో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు బుధవారం వినాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేసిన ప్రజలు, సాయంత్రం అనకాపల్లి పట్టణం శారద నది ఘాట్ వద్ద నిమజ్జనం చేసేందుకు తరలిరావడంతో శారదా నది బ్రిడ్జి, ఘాట్ భక్తులతో కిక్కిరిసిపోయింది, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు, జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.