ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డుస్థాయిలో ఉష్ణో గ్రతలు పడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కావడం కలవరపరుస్తోంది. గతేడాది జన వరి నెలలో తీవ్ర ప్రతాపం చూపిన చలి ఈ ఏడాది డిసెంబరులోనే వణికిస్తోంది. మొన్నటి వరకు 20 డిగ్రీలకుపైగా ఉన్న ఉష్ణోగ్రతలు శుక్రవారం రాత్రి ఒక్కసారిగా పడిపోవడంతో చలి ఉమ్మడి జిల్లాను గజ గజ వణికి స్తోంది.అర్లి (టి) లో 7.1 కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది.అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది.