ఒంగోలు పట్టణంలోని ఆటో డ్రైవర్లు మంగళవారం ఆర్టీసీ బస్సులలో బిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము జీవనోపాధి కోల్పోయామని వారు వాపోయారు. ఆటోలకు కిస్తీలు కూడా చెల్లించలేకున్నామని,కుటుంబాన్ని పోషించుకోలేని దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయని వారు కన్నీటిపర్యంతమయ్యారు.తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.