బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్ హాల్లో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాపట్ల కలెక్టర్ వెంకట మురళి తెలుగు భాషా పితామహుడు గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.తెలుగు భాషను మరింత వినియోగంలోకి తీసుకురావాలని ఉద్యమం చేసిన గొప్ప చారిత్రాత్మక వ్యక్తి రామమూర్తి అని కలెక్టర్ వెంకట మురళి కొనియాడారు.