అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం ఘనంగా తెలుగు భాషా దినోత్సవం వేదికలను నిర్వహించారు. బెలుగుప్ప ఉన్నత పాఠశాల, నరసాపురం గ్రామ ప్రాథమిక పాఠశాల, బెలుగుప్ప శ్రీ శ్రీనివాస విద్యానికేతన్ పాఠశాలల్లో తెలుగు భాష వ్యవహారిక పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాష దినోత్సవం కార్యక్రమాలను నిర్వహించారు.