బాపట్ల మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో శుక్రవారం ఆ పార్టీ శ్రేణులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించాయి.ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.కోన రఘుపతి మాట్లాడుతూ వైద్య కళాశాల ప్రైవేటుపరం చేయడం వల్ల పేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష అవుతుందన్నారు.ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.