వైసిపి టిడిపి పార్టీలు వేంపల్లి ప్రజల పాలిట శాపాలుగా మారాయిని ఆమ్ ఆద్మీ కడప జిల్లా కోఆర్డినేటర్ రహంతుల్లా పేర్కొన్నారు. వేంపల్లి గ్రామపంచాయతీ సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పాలకుల అధికారుల అసమర్ధ కారణమని చెప్పారు పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించకుండా ఊరిలో చెత్త ఎత్తకుండా సమ్మె చేస్తున్నారని చెప్పారు. ఆదాయం నిండుగా ఉన్న పంచాయతీ పరిస్థితి రోజురోజుకు హీనంగా తయారైందని చెప్పారు.