Download Now Banner

This browser does not support the video element.

చెన్నూరు: త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాల పంపిణీ

Chennur, Mancherial | Sep 1, 2025
త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందజేస్తామని మందమర్రి తహసిల్దార్ పొనకంటి సతీష్ కుమార్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం క్యాతనపల్లి మున్సిపాలిటీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయడానికి సన్నాహాల్లో భాగంగా ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఇండ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us