సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ప్రజల నుండి 154 దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రజావాణిలో ప్రజల నుండి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలను స్వీకరించి పరిష్కారానికి అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన వాటిని త్వరిత గతిన పరిష్కరించాలని సూచించారు. మొత్తం దరఖాస్తులు 154 వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డిఓ రాదాబాయి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డిఆర్డిఓ శేషాద్రి, జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.