ఈనెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన జిల్లా పర్యటనను విజయవంతం చేద్దామని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులతో కలసి శనివారం నిర్వహించిన సమావేశంలో టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి మండలం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు రైతులు మండల ప్రజలు పాల్గొనేందుకు తగిన ఏర్పాట్లను పూర్తిస్థాయిలో చేద్దామని పిలుపునిచ్చారు.