విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ యాజమాన్యాలు ప్రకటించిన ఈఓఐ ఉపసంహరించుకొవాలి, తద్వారా ఏర్పడే ఉపాధి రక్షణకై ఉద్యమించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. నేడు కుర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. దీనికి స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర పోరాటాలతో ముడిపడి ఉందని ఆయన వివరించారు.