అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాము వద్ద సోమవారం యూరియా ఎరువును పంపిణీ చేపట్టడంతో రైతన్నలు మండుటెండలోనే సైతం లెక్కచేయకుండా ఎగబడ్డారు. యూరియా ఎరువు ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాల్లోనూ రైతు మీసేవ కేంద్రాల సైతం చాలా కొరతగా ఉండటంతో భారీగా డిమాండ్ ఏర్పడింది. వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వ గోదాము వద్ద రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూరియా పంపిణీ చేపట్టారు. దీంతో రైతులు ఒక్కసారిగా అధిక సంఖ్యలో గోదాం వద్దకు చేరుకొని యూరియా కోసం ఎగబడ్డారు.