"భారతదేశం -ఆధునికత - అది ఎదుర్కొంటున్న సవాళ్ళు" అనే అంశంపై "ఎస్సెన్స్ గ్రూపు -వైజాగ్" ఆధ్వర్యంలో సభ.. కార్యక్రమం. ఆదివారం ద్వారకా నగర్ లో జరిగింది ముఖ్య అతిధిగా సోషల్ యాక్టివిస్ట్ గడియారం భార్గవ ముఖ్య ఉపన్యాసకులుగా భారతదేశం అంటే ఏమిటి? ఆధునికత అంటే ఏమిటి అనే అంశంతో మొదలు పెట్టి తాత్వికంగా చాలా లోతైన అంశాలు వివరించారు.ఉపనిషత్తుల కాలం తర్వాత మళ్ళీ మన దేశంలోకి ఆధునికత బ్రిటీష్ వలసవాదం వలననే ప్రవేశించిందనీ ఐతే ఆ ప్రవేశం రాజకీయార్థిక రంగాల్లోకి విస్తరించినాకానీ మన దేశీయుల ఆలోచనల్లోకి అభిరుచుల్లోకి రాకపోవడంతో స్వేచ్ఛా సమానత్వం హేతుబద్ధత లౌకికత అనే ఆధునిక విలువలుఉన్నాయన్నారు