పాలకొల్లులోని పూలపల్లిలోని గంటాలమ్మ గుడి సమీపంలో గల గంటా సత్తిబాబు, స్వరాజ్యలక్ష్మిల ఇంట్లో మంగళవారం గ్యాస్ రెగ్యులేటర్ లీకై మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన గృహిణి వెంటనే కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. అగ్నిమాపక సిబ్బంది, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సకాలంలో చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే మంటలను వారు అదుపు చేశారు.