మండల స్థాయి క్రీడా పోటీలను రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ ప్రారంభించారు. భెల్ జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో సంగారెడ్డి జిల్లా 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రామచంద్రపురం మండల స్థాయి అండర్ 15,17 సంవత్సర అమ్మాయిల, అబ్బాయిల కబడ్డీ, కోకో, వాలీబాల్ బాల్ ఎంపిక ప్రక్రియను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.