కలువాయి తహసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గం ఇంఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మనాద్, ట్రైనీ కలెక్టర్ సంజన సిన్హా, ఆర్డీఓ మధులత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రైతులు వారి వారి భూ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజలు, రైతుల సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి..ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని వారు అధికారులకు సూచించారు.