నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి లీగల్ సర్వీసెస్ సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు బుధవారం నారాయణపేట జిల్లా మద్దూర్ మండలము, దామరగిద్ద మండలంలోని చెన్నారెడ్డిపల్లె, పెద్రిపహాడ్ , వత్తుగుండ్ల గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సును చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మిపతి గౌడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన హక్కులు కల్పించిందని అన్నారు. ప్రజలు వాటిపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ హక్కులను నిర్భయంగా పొందుతారని తెలిపారు. ప్రజలందరు సమానమే ఉన్నవాళ్లు, పేదవాళ్ళు అని తేడా లేదు, పేదరిక నిర్ములన