సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతలపాలెం SI సందీప్ రెడ్డి అన్నారు. ఈరోజు చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో సైబర్ నేరాలపైన, అన్ లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఎటిఎం ఫిన్ నంబర్, సివివి నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే చెప్పరాదని ఎస్సై తెలిపారు.