రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చి సూపర్ హిట్ అయిందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమయంలోని అజంత సర్కిల్ వద్ద నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయిన సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్ర పాటలకు ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు.