నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ డిమాండ్ చేశారు. కందిలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.