సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారులో 65 నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, శనివారం సాయంత్రం పూణే వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని అదే రోడ్డులో వెనుక నుండి అతివేగంగా వచ్చిన డీసీఎం లారీ ఢీకొట్టడంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు క్షతగాత్రున్ని జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.