గీసుగొండ మండలంలోని శాయంపేట హవెలి గ్రామంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కే యం టి పి) ను గురువారం సాన్ ఫ్రానిస్కో , బ్రూనై దౌత్య కార్యాలయ బృందం శ్రీకర్ కె రెడ్డి IFS (ఇండియన్ ఫారెన్ సర్వీసెస్), రాములు అబ్బగాని IFS (ఇండియన్ ఫారెన్ సర్వీసెస్)లతో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలసి సందర్శించారు. వస్త్ర పరిశ్రమలోని గణేశా, యంగ్ వన్, ఈకోటెక్ పరిశ్రమలను సందర్శించి అందులోని ఉత్పత్తులను వారు పరిశీలించారు.