తిరుపతి జిల్లా నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వర రావు పర్యవేక్షణలో దొరవారి సత్రం ఎస్సై అజయ్ కుమార్ బృందం ఆదివారం ఈ ఆపరేషన్ నిర్వహించింది. డ్రోన్ కెమెరా సాయంతో కోడిపందేలు జరుగుతున్న ప్రదేశాన్ని గుర్తించి, 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు కోళ్లు, ఎనిమిది మోటార్ సైకిళ్లు, రూ.20,100 నగదు స్వాధీనం చేశారు. మండలంలో జూదాలు, కోడిపందేలు, మత్తు పదార్థాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఇవ్వమన్నారు. చట్టానికి విరుద్ధంగా జరిగే కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవు అన్నారు ప్రజలు తమ పరిసరాల్లో ఇలాంటి అనుమానాస్పద సంఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని స్పష్టం చేశ