క్రీడల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి:ఎమ్మిగనూరు ఎమ్మెల్యే.క్రీడకారులకు తగిన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టినా క్రీడాకారులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని పేర్కొన్నారు. అలాగే క్రీడాకారులకు తగిన శిక్షకులను అందుబాటులోకి తేవాలని అన్నారు. పర్మనెంట్ శిక్షకులను నియమించాలని కోరారు.