రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికీ గాయాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం నుండి చర్ల రోడ్డులోని మేడివాయి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహన దారుడికి, రోడ్డుపై నడుచుకుంటా వెళ్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి.. స్థానికులు 108 వాహనం ద్వారా భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..