శనివారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, డిఆర్డీ మొగిలి వెంకటేశ్వర్లు జ్యోతిని వెలిగించి, పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దేశం కోసం, రాష్ట్రం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుడన్నారు.