అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్ సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు అబూబకర్, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో రాధా కృష్ణన్ 137వ జయంతి, మదర్ థెరిసా 28వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముందుగా రాధాకృష్ణన్, మదర్ థెరిసా చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ పురాణాల ప్రకారం గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించే వ్యక్తి అని అర్ధం అన్నారు. మన జీవితాలను మలచడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని అన్నారు.