Download Now Banner

This browser does not support the video element.

మిర్యాలగూడ: గణేష్ నిమజ్జన శోభాయాత్రను శాంతియుత వాతావరణం లో ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: డీఎస్పీ రాజశేఖర్ రాజు.

Miryalaguda, Nalgonda | Sep 14, 2024
మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని ప్రకాష్ నగర్ 8వ వార్డు గణేష్ నగర్ లో శనివారం సాయంత్రం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గణనాధునికి 9 రోజులు ఏ విధంగా ఘనంగా పూజలు అందించారో అంతే ఘనంగా నిమజ్జన శోభాయాత్రను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us