మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో గత కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు అక్కెపల్లి గ్రామం వద్ద పూర్తిగా కొట్టుకుపోయిన లో లెవెల్ వంతెనను శనివారం సాయంత్రం అధికారులతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు మంత్రి వివేక్ తో గ్రామ ప్రజలు తమ సమస్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీలైనంత త్వరగా నూతన బ్రిడ్జిని నిర్మించడంతో పాటు గ్రామంలో నెలకొన్న సమస్యలనన్నిటినీ పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.