కొత్తపేట అసెంబ్లీ బహుజన సమజ్ పార్టీ అభ్యర్థిగా కాండ్రు వెంకటేష్ రేపు అనగా గురు వారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కొత్తపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తపేటలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలేల విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం కొత్తపేటలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను అందిస్తామని ఆయన తెలిపారు. ఈ ర్యాలీని బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని కోరారు.