నస్పూర్ పట్టణంలో మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్లెక్సీల విషయంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పోలీస్ స్టేషన్ సమీపంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు కాటం రాజుపై దాడి జరిగింది. దీంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ రావు తెలిపారు.