గంగవరం: మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపిన సమాచారం మేరకు. ఫ్లైఓవర్ ముందు మదనపల్లి వైపు వెళ్లే రహదారిలో రెండు అడుగుల మేర పెద్ద గుంత ఒకటి ఏర్పడింది. ఇటుగా ప్రయాణించే వాహనదారులు రాత్రిపూట గమనించకుండా ప్రమాదాలకు గురవుతున్నారని, పలు వార్తా కథనాలు ప్రసారమైన సంగతి విధితమే. దీంతో జెసిబి సహకారంతో కాంక్రీట్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో మరో గుంత ఏర్పాటు కాకుండా, పకడ్బందీగా వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందన్నారు. దీంతో వాహన దారులు హర్షం వ్యక్తం చేశారు.