భీంపూర్ మండల కేంద్రానికి సరిహద్దులోని పెన్ గంగా నాదీ తీరంలోని మహా రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో మూడు పులుల సంచరిస్తున్న చిత్రాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.పెన్ గంగా నాదీ సరిహద్దులోని రాంనగర్- సావర్గాం మార్గంలో మూడు పులులు ఓ ద్విచక్ర వాహనదారుడికి కనిపించగా పులుల సంచార చిత్రాలను తన ఫోన్ లో బంధించడంతో అవి వైరల్ గా మారాయి.తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం ఆయా గ్రామాలకు సమీపంలో ఉండటంతో తరచూ పులులు కనిపించడం పరిపాటిగా మారింది. ఇక ప్రతి ఏడాది వేసవిలో పెన్ గంగా నది దాటి మనవైపు పులులు వస్తుందటంతో వాటి సంరక్షనకోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు