జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు,వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన బృందాలు ఆదివారం జిల్లావ్యాప్తంగా ఎరువుల దుకాణాల గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి యూరియా నిల్వలను పరిశీలించాయి. యూరియాను ఎవరైనా అక్రమంగా నిలువ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎరువుల వ్యాపారులను అధికారులు హెచ్చరించారు.ప్రతిరోజూ యూరియా స్టాక్ నిల్వల సమాచారాన్ని కలెక్టర్ కార్యాలయానికి అందించాలని వారిని ఆదేశించారు. రైతులు తమ సమస్యలు తెలుపుకోవడానికి వీలుగా కాల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేశారు.