మట్టి గణపతి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రకాశం జిల్లా రాజల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకుడి విగ్రహాలను తయారుచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వివిధ రకాల వినాయకుడి విగ్రహాలను తయారు చేసిన విద్యార్థులను ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అనురాధ అభినందించారు. రసాయనాలతో తయారుచేసే వినాయకుడి విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని మట్టి విగ్రహాలను పూజించి వాటిని నిమజ్జనం చేయటం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు అన్నారు.