వనస్థలిపురం ఆటో డ్రైవర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శనివారం బీఎన్రెడ్డినగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటిక రెడ్డి అరవింద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆటో డ్రైవర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సంబంధించి ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన ఆటో డ్రైవర్స్ ఫెడరేషన్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు