దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై నిరసన వ్యక్తం చేస్తూ బాపట్లలో గురువారం టవర్ ఎక్కిన దివ్యాంగుల నాయకుడు చల్లా రామయ్య టవర్ దిగారు. చల్లా రామయ్య పవర్ ఎక్కిన విషయం తెలుసుకున్న మాజీమంత్రి, వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఘటనా స్థలానికి చేరుకొని కిందకు దించారు. ఈ నేపథ్యంలో వైద్యశాలకు తరలించే విషయంలో పోలీసులతో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షుడు నాగార్జునకు డిఎస్పీల మధ్య వాగ్వివాదం జరిగింది.