ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా అందించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు పెద్దాపురం పట్టణంలోని క్రిస్టియన్ పేటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు అందజేసి ప్రభుత్వ పనితీరుపై స్థానికుల నుండి వివరాలను రాబట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు,రండి సత్యనారాయణ, తూతిక రాజు,కొరుపూరి రాజు బేదంపూడి సత్తిబాబు, బేదంపూడి రాజు,మామిడి ఈశ్వరరావు, కొట్టెం బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.