నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రద్ధానందు గంజిలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మూడవ టౌన్ SI హరిబాబు సోమవారం తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి వయసు 35-40 సంవత్సరాల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఎవరైనా గుర్తుపడితే 8712659839 నంబర్కు లేదా మూడవ టౌను సంప్రదించాలన్నారు.