ఆళ్లగడ్డలోని అమ్మవారి శాలలో దనరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం విజయలక్ష్మి దేవి అలంకరణలో శ్రీ వాసవి మాత దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీశ్ బాబు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఏడాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రోజుకో అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.