భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం మందమర్రి ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ 2009లో శంకుస్థాపన చేసిన లెదర్ పార్క్ ఇప్పటివరకు కూడా పూర్తి చేయక పోవడంతో ఎలాంటి అభివృద్ధి లేక ఆ స్థలం కబ్జాకు గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి లెదర్ పార్క్ ని తొందరగా నిర్మాణం పూర్తి చేసి స్థానికంగా ఉన్న ప్రజలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపాలిటీలో నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.