అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పాడేరు అరకు నియోజకవర్గ వైయస్సార్ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో ఈ నెల 9వ తారీఖున జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం, మాజీ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, పాల్గుణ పాల్గొన్నారు. రైతన్నలను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వంకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.