ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ సర్కిల్ పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులకు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పలు సూచనలు సూచించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూజివీడు రూరల్ సర్కిల్ పరిధిలో మండపాలు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీస్, విద్యుత్ అధికారుల అనుమతులు తీసుకోవాలని మండపాల వద్ద ప్రతిరోజు కమిటీ సభ్యులు పరివేక్షించాలని, విద్యుత్ సరఫరా పిల్లలకు అందకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు పోలీసు నియమ నిబంధనలు పాటించని వారిపై చర్యలు చేపడతామన్నారు ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకోవాలని అన్నారు