వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని తెలంగాణా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమీషనర్ ఈ. శ్రీనివాస రావు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన అదనపు కమీషనరకు ఆలయ ఈఓ రామల సునీత, అర్చకులు మంగళవాద్యాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు.