కడప నగరంలోని రిమ్స్ ఆస్పత్రిలో పలు విభాగాల వద్ద ఆసుపత్రికి వచ్చే రోగులకు వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసి ఎల్సీడీ టీవీలు పనిచేయడంలేదన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు వ్యాధులబారిన పడకుండా అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో వైద్యశాఖ వీటిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎక్కడా ఇవి పనిచేయడంలేదు. వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి రోగుల ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.