శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి మంజు వాణి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆమె పరిశీలించారు సిబ్బందికి సూచనలు చేశారు .కేంద్రంలో అమలు అవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పురోగతి గురించి చర్చించి, రికార్డు పరిశీలించారు. వర్షాకాలం నందు వచ్చే కాలానుగుణ వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రాజకుమార్ ,సిహెచ్ఓ సీతాలక్ష్మి, ఎంపీహెచ్వో సుబ్రహ్మణ్యం ,పీహెచ్ఎన్ భాగ్యలక్ష్మి, వైద్య సిబ్బంది ఉన్నారు.